ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భక్తుడు అయిన కోటంరెడ్డి.. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చి తిరుగుబావుటా ఎగరవేశాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పై, చంద్రబాబును కలిశారు అన్న వార్తలపై, ప్రభుత్వ సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణ పై తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమ్రోగుతున్న పేరు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న కోటంరెడ్డి.. గత కొంతకాలంగా సొంత పార్టీమీదే విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ వివాదంతో వైఎస్ఆర్ సీపీ పార్టీకి దూరం అయ్యాడు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలపై, జగన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి, సజ్జల పార్టీలో సృష్టిస్తున్న విభేదాల గురించి తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చారు. మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది అని సీఎం జగన్ మిమ్మల్ని మందలించారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
“నేను అవినీతి చేశాను అనేది అబద్దం. స్వయంగా ఈ లీకులు అన్ని సజ్జల రామకృష్ణ రెడ్డి తన అనుచరులతో జగన్ కు లీకులు ఇప్పించారు. నా అవినీతి చిట్టా మీ దగ్గర ఉంటే.. విచారణ చేయించండి నేను ఎదుర్కొంటాను. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. సజ్జల రామకృష్ణ లాంటి వ్యక్తులే నాకు, జగన్ కు విభేదాలు సృష్టిస్తున్నారు. నాకే కాదు మిగతా నాయకులకు కూడా ఇతని లాంటి వాళ్లే విభేదాలు తీసుకొస్తున్నారు” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రి జగన్ తో నాకిప్పటికీ విభేదాలు లేవని, కేవలం అతని వల్లే నేను వైసీపీ నుంచి బయటకి వచ్చానని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.