ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి. తాజాగా కర్నూలులో సాగుతున్న యువగళం పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై తీవ్ర ఆరోణపలు చేశారు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక తనపై చేసిన నిరాధర ఆరోపణలు నిరూపిస్తే… పాదయాత్రలో ఆయన వెంట నడుస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు నియోజవర్గంలో కొనసాగుతుంది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచి స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే వారు. ధర్మవరం, పెనుకొండ, తాడిపత్రి, శ్రీకాళ హస్తి, హిందూపురం, పాణ్యం.. ఇలా లోకేశ్ పాదయాత్ర చేసిన ప్రతి నియోజక వర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా కర్నూలు నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై భూకబ్జా ఆరోణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్దానికంగా ఉన్న పలు స్ధలాల్ని ఆక్రమించుకుంటున్నట్లు లోకేశ్ ఆరోపణలు చేశారు. దీంతో లోకేశ్ చేసిన ఆరోపణలపై స్ధానికంగా చర్చ మొదలైంది. ఇది కాస్తా పెరుగుతుండటంతో హఫీజ్ ఖాన్ స్పందించక తప్పలేదు. లోకేష్ ఆరోపణలపై స్పందించిన హఫీజ్ ఖాన్ సవాలు విసిరారు. లోకేశ్ తనపై చేసిన భూకబ్జా ఆరోపణలపై హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూకబ్జాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలాగే లోకేష్ తో కలిసి పాదయాత్రలో నడుస్తానంటూ సవాల్ విసిరారు. తాను అమెరికాలో లగ్జరీ లైఫ్ వదులుకుని సేవ కోసం కర్నూలు వచ్చానంటూ హఫీజ్ ఖాన్ వెల్లడించారు. కర్నూలుకు అన్యాయం చేసిన ఘనత టీడీపీది అన్నారు. నాలుగేళ్లుగా కర్నూల్ కి తాను ఎంతో సేవ చేశానని ఎమ్మెల్యే తెలిపారు. మరి.. లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.