సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. అతడి కుటుంబ సభ్యులతో పాటు.. సమాజం కూడా హర్షిస్తుంది. వారి విజయాన్ని తమ విజయంలానే భావిస్తుంది. ఇక ఇలాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. ఎంపీగా ఎదిగిన తీరు అభినందనీయం. ఎంపీగా గెలవడానికి ముందు వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన నందిగాం సురేష్ ని ప్రస్తుతం వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. వీరంగం ఆడారు. గతంలో కూడా ఓ కానిస్టేబుల్ నందిగాం సురేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించని సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి.. ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవడం పట్ల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
తాజాగా జరిగిన వివాదాంలో ర్యాష్ డ్రైవింగ్ చేశారనే ఆరోపణల మీద కొందరు కుర్రాళ్లును విజయవాడ కృష్టలంక పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తాము నందిగాం సురేష్ అనుచరంల అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసిన తర్వాత నందిగాం సురేష్ తన అనుచరులతో పోలీస్ స్టేషన్ కి వచ్చి.. వీరంగం సృష్టించారు. పోలీసులను తిడుతూ.. స్టేషన్ లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశాడు. ఆయన అనుచరులు పోలీసులపై దాడి కూడా చేశారని తెలిసింది.
ఇది కూడా చదవండి : పోలీస్ స్టేషన్ లో అర్థరాత్రి ఎంపీ నందిగాం సురేష్.. అసలేం జరిగింది
గతంలో కూడా ఆరోపణలు..
గతేడాది డిసెంబర్ కూడా నందిగామ సురేష్ పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. సస్పెండ్ చేసిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరినందుకు ఎంపీ నందిగాం సురేశ్ తనపై చేయి చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఒకరు ఆరోపించారు. ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి వినపతిపత్రం అందించిన సంగతి తెలిసిందే.
ఇప్పిటివరకైతే నందిగాం సురేష్ పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయనపై ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ కానీ, స్కాంలలో ఆయన పేరు వినిపించడం కానీ జరగలేదు. పైగా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే ముద్ర ఉంది. ఇక తాజాగా వెలుగు చూసిన వివాదంలో కూడా ఆయన కార్యకర్తల కోసమే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కాకపోతే కాస్త దూకుడుగా వ్యవహరించారు. దాంతో విషయం కాస్త అధిష్టానానికి చేరిందని సమాచారం. వివాదల వ్యవహారం ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో ఆయనకు తలనొప్పి తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక అధికారులు, పోలీసులతో వ్యవహరించేటప్పుడు కాస్త కంట్రోల్ గా ఉంటే బాగుంటుందని కార్యకర్తలు భావిస్తున్నారట. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.