కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. పార్టీలన్ని ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో అన్ని పార్టీల టార్గెట్ ఇప్పుడు ఎలక్షన్ 2024గా మారింది. ఈ క్రమంలో శుక్రవారం చోటు చేసుకున్న ఓ సంఘటనపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్.. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లితో భేటీ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరద్దిరి భేటీపై ఏపీ రాజకీయ సర్కిళ్లల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. త్వరలో ఏపీలో కూడా పార్టీ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకే ఆమె భర్త బ్రదర్ అనిల్.. ఉండవల్లితో భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పార్టీ స్థాపించినప్పటికి.. అనుకున్నంత ఆదరణ లభించడం లేదని షర్మిల భావిస్తున్నారట. ఇదే క్రమంలో ఏపీలో వైఎస్ కుటుంబంపై ఉన్న ఆదరణ తనకు కలసి వస్తుందని భావిస్తోన్నారని.. ఆ దిశగా అడగులు వేస్తున్నారని.. దానిలో భాగంగానే ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. గతంలో షర్మిల ఏపీలో పార్టీ ఏర్పాటుపై స్పందిస్తూ రాజకీయ పార్టీ అన్నది ఎవరు.. ఎక్కడైనా పెట్టొచ్చని… తాను ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెడితే తప్పు ఏంటి అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ భేటీకి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల బరిలో నారా బ్రహ్మణి! పోటీ ఖాయమా?
2024 ఎన్నికల నాటికి ఏపీలో పార్టీ స్థాపించాలని షర్మిల భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రసుత్తం ఏపీ రాజకీయాలు, పార్టీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, విపక్షాల పరిస్థితి వంటి తదితర అంశాల గురించి చర్చించడం కోసమే అనిల్ కుమార్, ఉండవల్లితో భేటీ అయ్యారని సమాచారం. సమావేశం అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయపరమైన అంశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించామని తెలిపారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉండవల్లి అరుణ్ కుమార్ కి మంచి అనుబంధం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో సన్నిహితుడిగా మెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్.. వైఎస్సార్ దయ వల్లే తాను ఎంపీ అయ్యానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అలాగే, వైఎస్సార్‌కు నోట్లో నాలుకలా ఉండవల్లి అరుణ్ కుమార్ మెలిగారు. వైఎస్ మరణం తర్వాత ఉండవల్లి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.. జగన్ వెంట వెళ్లలేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండవల్లి ఆయనకు అనుకూలంగా మాట్లాడేవారు. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చినప్పటికి ఉండవల్లిని చేరదీయలేదు.
ఇది కూడా చదవండి : టీడీపీలో ఊహించని మలుపు! రంగంలోకి బ్రహ్మణి!
షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. రాజకీయంగా ఆమెకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉండవల్లి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. ఏపీ రాజకీయాల్లో ఉండవల్లికి ఉన్న అనుభవం షర్మిలకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. పైగా ఉండవల్లికి వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో అభిమానం. ఇవన్ని షర్మిలకు కలిసి వచ్చే అంశాలు కావడం వల్లే ఉండవల్లి-బ్రదర్ అనిల్ ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో షర్మిల పార్టీ పెడితే.. ఉండవల్లి అన్ని విధాలుగా ఆమెకు మద్దతిస్తారని.. పార్టీలో కూడా చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఈ భేటీ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.