ఏపీలో త్వరలో ఉప ఎన్నికల నగరా మోగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. త్వరలో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే దీని గురించి ఎన్నికల కమిషన్ కు సమాచారం అందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో.. గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు పోటీ చేస్తారు.. సీఎం జగన్ దృష్టిలో ఎవరు ఉన్నారు.. మేకపాటి కుటుంబం నుంచి ఎవరు నిలబడనున్నారు అనే దాని గురించి జోరుగా చర్చించుకుంటున్నారు నియోజకవర్గ జనాలు.
ఇది కూడా చదవండి : గౌతమ్ రెడ్డి కోసం మేకపాటి కుటుంబం సంచలన నిర్ణయం!
సాధారణంగా ఎవరైనా రాజీనామా చేసి.. ఉప ఎన్నిక వస్తే.. అన్ని పార్టీలు బరిలో నిలుస్తాయి. కానీ ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ మృతితో ఉప ఎన్నిక వస్తే.. మిగతా రాజకీయ పార్టీలు పోటీ చేయవు. రాజకీయాల్లో ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు అన్ని పార్టీల నేతలు సహకరిస్తారు. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా ఇలానే ఏకగ్రీవం కానుంది. విపక్షాలు కూడా ఎవరిని పోటీకి దింపే అవకాశాలు లేవు. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి వాడుగా పేరుపొందడం, వివాద రహితుడిగా ఉండటంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సైతం ముందుకు రావని సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికలలో పోట చేసే అవకాశాలు లేవనే అంటున్నారు విశ్లేషకులు.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో జగన్ ఎవరిని బరిలో నిలుపుతారు అనే దాని గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేకపాటి కుటీంబీకులే బరిలో ఉంటారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరిని పోటీలో నిలుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడటంతో ఆయన ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో లేరు. ఇక మేకపాటి కుంటుంబంలో మిగిలింది గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి రెడ్డి. ఇక జగన్ కూడా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడుది చిన్న వయసు కావడంతో.. శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో శ్రీకీర్తి రెడ్డి పోటీకి నిలిపే విషయంపై గౌతమ్ రెడ్డి దశ దిన కర్మ పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి వైసీపీ హైకమాండ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీకీర్తి రెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పార్టీ నెల్లూరు జిల్లా నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. దీంతో శ్రీకీర్తి రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.