ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి. కేవలం కర్నూలులోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బైరెడ్డికి ఫ్యాన్స్ ఉన్నారు. మంత్రులకంటే ఎక్కువగా ఆయనకు జనంలో మాస్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంగతి అయితే, చెప్పనక్కర్లేదు. ఇదొక్కటే కాదు.. బైరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తాత, పెద్దనాన్న పెద్ద పెద్ద పదువుల్లో కొనసాగారు. రాజకీయంగా జిల్లాలో పట్టు సాధించారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చెందాన బైరెడ్డికి రాజకీయాల్లో ఎదుగుదల లేకుండా పోయింది. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్‌కు తగ్గ పదవి లభించటం లేదు. ఇదే ఆయన్ని, ఆయనను అభిమానించే వారి మనసులను తొలుస్తున్న బాధ.
బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డిది నందికోట్కూర్ నియోజకవర్గం. నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్‌తో పాటు మంచి పట్టు కూడా ఉంది. ఎంత ఫాలోయింగ్, పట్టు ఉన్నా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్‌డ్. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో బైరెడ్డి పోటీ చేయటానికి అవకాశం ఉండదు. దీంతో అధిష్టానం ఆయనకు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధత్యలు ఇచ్చింది. బైరెడ్డి కూడా అధిష్టానం అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. అంతేకాదు! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలవటానికి కృష్టి చేశారు. బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పని తనాన్ని మెచ్చిన అధిష్టానం ఆయనను రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ ఛైర్మన్‌గా నియమించింది.
2024 ఎన్నికలు దగ్గర పడే కొద్ది బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డిలో టెన్షన్ మొదలవుతోంది. బైరెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారట. బైరెడ్డి దీని గురించి తరచుగా అధిష్టానాన్ని సంప్రదిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, అధిష్టానం మాత్రం ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదంట. దీనికి కారణం లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో బలమైన నాయకులే ఉన్నారు. వీరిని కాదని ఓ యువకుడి సీటు ఇవ్వటం ఓ సాహసమే. జగన్ క్రేజ్ కారణంగా బైరెడ్డి గెలిచే అవకాశం ఉన్నా.. సీనియర్లను దూరం చేసుకోవటాన్ని జగన్ ఇష్టపడటం లేదట. అందుకే బైరెడ్డికి హమీ ఇవ్వలేకపోతున్నట్లు సమాచారం. అయితే, ఇది ఇప్పటి పరిస్థితి.. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు. మరి, అద్భుతం జరిగి బైరెడ్డికి సీఎం జగన్‌నుంచి స్పష్టమైన హామీ వస్తుందేమో వేచి చూడాల్సిందే.