Venkaiah Naidu: బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర కీలక నేతలందరూ వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ తరపున వెంకయ్యనాయుడ్ని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. మంగళవారం నాటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెంకయ్యనాయుడి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.