ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య జోరుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికి కూడా ఇరు వర్గాల నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడంలో ముందుంటారు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ కుమార్తెకే గౌరవ మర్యాదలకు దిక్కులేదని… ఇక తన పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అన్నారు. అందుకే తన పిల్లలతో నేను మాట్లాడే వీడియోలు చూస్తే.. చూడండి కానీ.. కింద కామెంట్స్ చదవకండి అని చెబుతాను అన్నది. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా అనిత వైసీపీ పాలనపై.. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ఈ మూడేళ్ల పాలనలో ఎప్పుడు ఏ పోలీస్ వచ్చి తీసుకెళ్తాడో తెలియడం లేదని.. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కళ్లలో నుంచి నీళ్లు రావు అన్నారు అనిత. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పీక్స్‌లో తమనను ఇబ్బంది పెట్టారని.. టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తమ మొదటి టార్గెట్ కొడాలి నాని ఉంటారన్నారు అనిత. అంతా సిస్టమ్ ప్రకారమే, షరతులు వర్తిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయితే బూతులు తిట్టడానికి పేటెంట్ రైట్ ఇచ్చారా అంటూ మాజీ మంత్రిని ఉద్దేశించి విమర్శించారు అనిత. ఇక తమ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఎవరైనా తిడితే ఊరుకునేది లేదని.. తనకు బీపీ వస్తుందని చెప్పుకొచ్చారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బే కరెక్ట్ అంటూ తనపై, టీడీపీపై విమర్శలు చేసేవారికి కౌంటర్ ఇచ్చారు అనిత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.