వల్లభనేని వంశీ.. ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజకీయాలను హీట్ ఎక్కించిన పేరు ఇది. వంశీ ఏ ముహూర్తాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా మారారో అప్పటి నుండి ఆయన చంద్రబాబుని, చంద్రబాబు వర్గాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. కానీ.. కొన్ని రోజుల క్రితం వంశీ.. చంద్రబాబు సతీమణి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇక తరువాత ఇవే మాటలు అసెంబ్లీలో కూడా రిపీట్ అయ్యాయని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. తాజాగా వల్లభనేని వంశీ సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలో తన కామెంట్స్ పై వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన మాటలు తప్పే అని ఒప్పుకుంటూ అందుకు దారి తీసిన పరిస్థితిలను వివరించారు వంశీ.
“టీడీపీ పార్టీలో ఉన్నంత కాలం పార్టీ కృషికి కష్టపడ్డాను. కానీ.., ఆ పార్టీలో నన్ను, కొడాలి నానిని ఎప్పుడూ జూనియర్ యన్టీఆర్ మనుషుల్లానే చూస్తూ వచ్చారు. ఇక నాని పార్టీ వదిలి బయటకి వెళ్ళాక కూడా దేవినేనిని అడ్డు పెట్టుకుని నానిని టార్గెట్ చేశాడు లోకేశ్. ఇక సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు కావాలని రాయించాడు.
ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గరికి కూడా నేను తీసుకెళ్ళాను. అయినా.. ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి జూనియర్ యన్టీఆర్ అంటే లోకేశ్ కి ఒక రకమైన భయం. ఎప్పటికైనా తనకి పోటీ వస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను, నాని.. జూనియర్ యన్టీఆర్ మనుషులం కాబట్టి, మేము ఎప్పటికైనా యన్టీఆర్ పల్లకి మోసే వాల్ళమే అన్నది లోకేశ్ నమ్మకం. ఇందుకే సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన నాపైనే తప్పు వార్తలు రాయించాడు. నా క్యారెక్టర్ ని కించపరిచే వార్తలు రాయించాడు. కాబట్టే.. నేను కూడా చంద్రబాబుపై, లోకేశ్ పై విమర్శలు చేయాల్సి వచ్చిందని వంశీ సమాధానం ఇచ్చారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.