రాజన్న రాజ్యం రావాలంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టంది వైఎస్సార్ కూతరు షర్మిల. ఇక వచ్చిన మొదట్లోనే పార్టీని పెడతానంటూ చెప్పింది. చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో జెండాను సైతం పాతేసింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారవుతోంది వైఎస్ షర్మిల. ఇక ఆమెకు ఆదిలోనే పార్టీ నేతలతో తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.
ఇక విషయం ఏంటటే… తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రతాప్‌రెడ్డి, కేటీ నర్సింహారెడ్డి వైఎస్సార్ టీపీకి రాజీనామా చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ టీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇక ఇదే జిల్లాలో వైఎస్సార్ టీపీకి కీలక నేతగా ఉన్నారు కేటీ నర్సింహారెడ్డి ఉన్నారు. వీరు రాజీనామా చేస్తూ పార్టీ కార్యాలయానికి రాజీనామా పత్రాన్ని పంపారు. ఇక పార్టీలోని సీనియర్ నేతగా కొనసాగుతున్నారు కొండా రాఘవరెడ్డి. ఆయన వ్యవహార శైలీ ఆ నేతలకు నచ్చలేక పార్టీకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడు పార్టీని కాస్త ముందుకు తీసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయటం కాస్త నష్టమనే చెప్పాలి. ఇక ఇటీవల పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ కాస్త దూకుడు పెంచారనె చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సమయమొచ్చినప్పుడల్లా తన మాటల తూటాలతో స్పందిస్తూ వస్తున్నారు షర్మిల. ప్రజల్లో పార్టీ ఉనిఖీని తెలిపేందుకు వరుసగా నేతలతో సమావేశాలు, దీక్షలు వంటివి చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోని పార్టీకి కొందరు కీలక నేతలు రాజీనామా చేయటమనేది షర్మిలకు ఖంగుతినే అంశమనే చెప్పాలి. ఇక ముందు ముందు ఇంకా ఎవరెవరు రాజీనామా చేస్తారో చూడాలి మరి.