వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు రేణుకా చౌదరి. ఈ క్రమంలో తాజాగా రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అది కూడా ఏపీ ఫైర్ బ్రాండ్, అధికార వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేస్తాను అంటూ ప్రకటించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేస్తానని వెల్లడించారు. మొన్నటి వరకు మనం ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే కదా.. మరి అలాంటప్పుడు ఏపీలో పోటీ చేస్తే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. అంతేకాక ఏపీలో పోటీ చేయాలని గత కొంత కాలంగా తనపై ఒత్తిడి వస్తుందని.. అందుకే ఏపీలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. అందుకే తాను రానున్న ఎన్నికల్లో గుడివాడ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు రేణుకా చౌదరి.
అలానే వచ్చే ఎన్నికల్లో తాను ఏపీతో పాటు.. తెలంగాణ ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తానని రేణుకా చౌదరి వెల్లడించారు. అంతేకాక రెండు చోట్లా పోటీ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఇటు ఏపీ, అటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి రేణుకా చౌదరి ఏపీలో పోటీ చేస్తే.. విజయం సాధిస్తారు అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.