దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. కానీ, దాని ప్రకంపనాలు మాత్రం తెలంగాణలో వినిపించాయి. ఈ ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కె.కవిత కు సంబంధం ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు లిక్కర్ స్కామ్ తో కవిత సంబంధం ఉందంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ స్కామ్ విషయంలో కవిత పేరు వాడొదంటూ ఇటీవల కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఈ స్కామ్ విషయంలో కవిత పేరు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదు అంటూ ఆదేశాలిచ్చింది. ఇలా కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా ఈ స్కామ్ కు సంబంధించిన అంశాలతో పాటు, నిజమాబాద్ లో తన ఓటమి కారణాలు, ఇతర రాజకీయ విశేషాలను ఎమ్మెల్సీ కవిత పంచుకున్నారు.
కవిత మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ అంటే బీజేపీ సర్కార్ భయం. అందుకే కేసీఆర్ పక్కన ఉండేవారిని ఇబ్బంది పెడుతున్నారని, కేసీఆర్ పై కక్షతో తన పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు కవిత తెలిపారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు కవిత పేర్కొన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారని, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అయిందో లేదో కూడా తెలియదు.అడ్డదారుల్లో 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని కవిత అన్నారు. తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నం చేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర చేస్తోందన్నారు కవిత.కేసీఆర్ తెలంగాణాలో ఎన్నో గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు ఆమె తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత ఇంకా మరేన్నో విషయాలు తెలిపింది.