జూనియర్ ఎన్టీఆర్- కొడాలి నాని ప్రస్తుతం ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరి బంధం గురించి, వారి మధ్య ఉన్న స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భంల్లో వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులం అంటూ వారి మాటల్లోనే చెప్పుకున్నారు. తర్వాత మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారి మధ్య స్నేహం తగ్గిందనో, వారి మధ్య దూరం పెరిగిందనో కొందరు భావించి ఉండచ్చు కానీ, అలాంటిది ఏమీ లేదని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కొడాలి నాని- తారక్- వంశీ కలిసున్న పాత ఫొటో ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ ఫొటో సాంబ సినిమా షూటింగ్ సమయంలో తీసింది. షూట్ మధ్యలో బ్రేక్ టైమ్‌లో ముగ్గురూ కూర్చుని సరదాగా ముచ్చిటించుకుంటున్న సందర్భం అది. అప్పుడు కొడాలి నాని కాలి మీద కాలేసుకుని కూర్చుని ఉంటే. నాని కాళ్లపై తారక్ కాలు పెట్టి కూర్చున్నాడు. వాళ్లేదో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
ఆ ఫొటోని సోషల్ మీడియాలో చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే.. కొందరు మాత్రం అదీ కొడాలి నాని బానిసత్వపు జీవితం అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మిత్రుల మధ్య స్నేహం, అభిమానం, ఆప్యాయత ఉంటాయి గానీ.. బానిసత్వం, వెట్టి చాకిరి, ఊడిగం లాంటి వాటికి తావుండదు. మీరు మీ ప్రాణ స్నేహితుడిపై కాలు వేస్తే అది అతని వద్ద మీకున్న చనువు, అతనిపై మీకున్న అభిమానం అవుతుంది. అంతేగానీ అతను మీకు బానిస అని కాదు.
తారక్- కొడాలి నాని స్నేహం నిన్న మొన్నటిది కాదని అందరికీ తెలుసు. కొడాలి నాని, వంశీ.. హరికృష్ణకు నమ్మకస్తులు, అనుచరులు. ఆయన పిలుపుతోనే తెలుగు దేశం పార్టీలో చేరి వారి రాజకీయ జీవితాలను ప్రారంభించారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు రాజకీయంగా వారి దారులు వేరయ్యాయని జగమెరిగిన సత్యం. ఆ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం తగ్గిందనేది మాత్రం అవాస్తవమనే చెప్పాలి.
కొడాలి నాని స్వతహాగా దూకుడుగా ఉంటారని అందరికీ తెలిసిందే. కొన్ని సందర్భాల్లో కాదు.. చాలా సందర్భాల్లో ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తారు. ఆ విమర్శలు, వ్యాఖ్యలు నచ్చని వాళ్లు ఆయనపై ప్రతి దాడి చేస్తుంటారు. అయితే ఇదంతా పూర్తిగా రాజకీయ కోణంలో సాగే విషయం. కానీ, ఇప్పుడు కొందరు వీరి స్నేహంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్– కొడాలి నాని మధ్య ఉన్న కల్మషంలేని స్నేహానికి బానిసత్వం అనే పేరు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. సోషల్ మీడియాలో వారి ఫ్రెండ్‌షిప్‌పై నెగెటివ్ కామెంట్స్ వ్యాప్తి చేస్తూ వారి మధ్యలేని విభేదాలను కొత్తగా సృష్టించాలని చూస్తున్నారు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ‘స్నేహం- బానిసత్వం’ ఈ రెండు పదాలకు చాలా వ్యాత్యాసం ఉంది. ‘బానిస.. మిత్రుడు కావొచ్చేమో గానీ.. మిత్రుడు ఎన్నటికీ బానిస కాడు’. తారక్-కొడాలి నానిపై జరుగుతున్న ట్రోలింపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.