బద్వెల్ ఉప ఉన్నికల్లో అధికార వైసీపీ వార్ వన్ సైడ్ అంటూ మరోసారి తన సత్తాను చూపించింది. మొదటి రెండు రౌండ్ల నుంచే వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ ప్రత్యర్థులకు చిక్కకుండా భారీ ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్లింది. వైసీపీ అభ్యర్ధిగా పోరులో నిలబడ్డ డాక్టర్ సుధ బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య చనిపోవటంతో ప్రజా ప్రతినిధి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో నిలబడటంతో సాంప్రదాయం ప్రకారం పోటీ చేయకూడదని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ పోటీలో మాత్రం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు నిలబడ్డాయి.
ఇక ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ భారీ మెజార్టీతో విజయాన్ని ఎగరేసుకుపోయింది. అయితే చనిపోయిన డాక్టర్ వెంకటసుబ్బయ్య సానుభూతితోనే వైసీపీ గెలిచిందని అధికార పార్టీ అభివృద్ధి చూసి కాదని ప్రత్యర్థి పార్టీలు పెదవి విప్పుతున్నాయి. ఇక బద్వెల్ ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.