సైకిల్ పై సచివాలయానికి వచ్చిన మంత్రి.. వినటానికి అదోలా ఉన్న ముమ్మాటికి నిజం. అసలు ఆ మంత్రి సచివాలయానికి ఎందుకు సైకిల్ పై వచ్చాడు. దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటంటే?
సైకిల్ పై సచివాలయానికి వచ్చిన మంత్రి.. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆయనొక్కడే కాదండోయ్.. ఆయనతో పాటు అతని సెక్యూరిటీ గార్డులు సైతం సచివాలయానికి సైకిల్ మీద వచ్చారు. దీనికి ఓ కారణం ఉందని, అందుకే ఇలా సైకిల్ మీద వచ్చానని మంత్రి తెలిపారు. అసలు ఎవరా మంత్రి? ఆయన ఎందుకు సైకిల్ మీద వచ్చాడనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాజకీయాల్లో ఒక్కో లీడర్ ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. ఇకపోతే.. పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడప్పుడు కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ అవతారాల్లో వచ్చి తమ నిరసనను తెలియజేస్తుంటారు. అయితే తాజాగా అచ్చం ఇలాగే చేశాడు బిహార్ కు చెందని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రతాప్ యాదవ్. ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డులు సైతం సచివాలయానికి సైకిల్ పై వచ్చారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి ప్రతాప్ యాదవ్.. సమాజ్ వాది పార్టీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రాత్రి నా కలలోకి వచ్చారన్నారు.
ఇక నాతో మాట్లాడాడని, ఆయన ఇచ్చిన స్ఫూర్తి కారణంగానే సైకిల్ పై సచివాలయానికి వచ్చానని తెలిపారు. ఇక ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం సైకిల్ పై వచ్చానని మంత్రి ప్రతాప్ యాదవ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పర్యావరణ పరిక్షణపై అవగాహన కల్పించేందుకు మంత్రి ప్రతాప్ యాదవ్ సైకిల్ పై రావడంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#WATCH | “I dreamt of going to Vrindavan&saw Netaji (Mulayam Singh Yadav). I then went to Saifai.I told him I wanted to see him&his village. We rode bicycles…I decided to go to Secretariat on a bicycle,save environment&spread Netaji’s message..,” says Bihar min Tej Pratap Yadav pic.twitter.com/Hye3j1t3wV
— ANI (@ANI) February 22, 2023