రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా రైతుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో చెరుకు రైతుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సర్కార్ ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయంతో ఏకంగా 5 కోట్ల మంది చెరుకు రైతులు లబ్ది పొందనున్నారు. అసలు చెరుకు రైతుల విషయంలో కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే?
బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ చెరుకు రైతులకు తీపి కబురును అందించింది. చెరుకుకు కనీస మద్ధతు ధర రూ.315కు పెంచుతూ తాజాగా కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. చెరుకు క్వింటాల్ ధర రూ.315 పెంచినట్లు ఆయన తెలిపారు. ఇదే కాకుండా ఈ స్థాయిలో చెరుకు ఇంత ధర పెంచడం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. పెరిగిన ధరతో ఏకంగా 5 కోట్ల మంది చెరుకు రైతులు లబ్ధి పొందనున్నారని ఆయన చెప్పారు.