నారా చంద్రబాబు నాయుడు.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర. అనేక దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. రాజకీయాల్లో ఇంతటి ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు ఏపీలోని అధికార పార్టీని ఎదుర్కోవటంలో పచ్చ పార్టీ వెనక పడ్డట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. అయితే ఈ మధ్య కాలంలో చంద్రబాబు సొంత పార్టీ నేతల వ్యవహారంతో తల దించుకోవాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నట్లు పార్టీలోని ప్రముఖ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.
ఈ క్రమంలోనే మొన్న గోరెంట్ల బుచ్చయమ చౌదరి పార్టీని వీడుతున్నారన్న వార్తలు గుప్పమన్నాయి. దీంతో ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగి బుచ్చయ్య చౌదరికి సర్దిచెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే బుచ్చయ్య చౌదరి కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఇది మరువకముందే జేసీ చేసిన కామెంట్స్ కూడా పార్టీలోని ముఖ్య నేతలకు కాస్త చెమటలు పట్టించే అంశంగా చెప్పవచ్చు.
ఇక ఇది మరువకముందే.. తాజాగా కోడెల శివ ప్రసాద్ తనయుడు కోడెల శివరాంపై మాటల దాడికి దిగటంతో పాటు రూ.32 లక్షలు తీసుకున్నారంటూ టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇలాంటి వరుస ఘటనలతో పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోతుందని పార్టీలోని కీలక నేతల వాదన. మరి ఇకనైన పార్టీ నేతలు వాదనలు, ప్రతివాదనలకు దిగకుండా పార్టీ ఎదుగుదలకు కష్టపడతారేమో చూడలి మరి. ఇక ఏపీలో టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఎంత వరకు సక్సెస్ అయ్యిందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.