తెలంగాణ సర్కార్ ఊహించని నిర్ణయం తీసుకోనుందా? షాకింగ్ నిర్ణయాలతో ప్రజల నడ్డి మరోసారి విరవనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ క్యాబినెట్ లో. ఇక ఈ మధ్య కాలంలోనే తెలంగాణ సర్కార్ టీఎస్ఆర్టీసీ సంస్థలోని చైర్మన్, ఎండీగా కొత్తవారిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నష్టాల్లో కురుకుపోతున్న టీఎస్ఆర్టీసీని లాభాల పాట పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఇక నష్టాల్లో ఉన్న రవాణా సంస్థను పూర్చేందుకు ఆ భారం మొత్తాన్ని ప్రజలపై మోపేందుకు సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బస్సు ఛార్జీలను 20-30% మేర పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనున్నారట. ఇక ఈ భారంతో సరిపెట్ట కుండా విద్యుత్ ఛార్జీలను కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు అంశాలపై క్యాబినెట్ మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఒకపక్క భారీగా మండిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు తట్టుకోలేకపోతున్న జనాలపై మరో పిడుగు పడనుందని మాత్రం పక్కగా అర్దమవుతోంది. ఇక పెంచబోయే విద్యుత్, బస్సు ఛార్జీలను హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత పెంచే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ముందే ఈ రేట్లను పెంచితే ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత మొదలై ఒటమి తప్పదేమోనన్న భావనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. దీంతో ఉప ఎన్నిక తర్వాత నిజంగానే విద్యుత్, బస్సు ఛార్జీలు పెంచితే గనుక సామన్యులకు మరోసారి భారం తప్పేలేదేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యుత్, బస్సు ఛార్జీల పెంపు దిశగా అడుగులు వేస్తున్న సర్కార్ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.