తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. తనతో పాటు కలిసివచ్చే పార్టీలతో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం అవుతూ వస్తున్నారు. తాజాగా, సీఎం కేసీఆర్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫ్రంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్‌తో చర్చ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ దేశం సరైన దిశలో నడవాలి. అచ్చే భారత్ కావాలి.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్లలో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. దేశానికి కొత్త అజెండా కావాలి. అందులో భాగంగానే అందరినీ కలుస్తున్నా. యాంటీ బీజేపీ ఫ్రంట్, యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్.. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ ఏవీ లేవు. ఏదైనా ఉంటే చెబుతాం. ప్రత్యామ్నాయ ఆలోచనా విధానం రావాల్సిన అవసరం ఉంది. మేము ఎవరికీ అనుకూలం.. వ్యతిరేకం కాదు’’ అని ఆయన అన్నారు. అంతేకాదు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీనియర్ నేత, హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ సహకరించారని చెప్పారు. పలుమార్లు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. వారితో జాతీయ రాజకీయాలపై చర్చించామని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 2001 లో ప్రారంభించామని, ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా శిబు సోరెన్ గారు హాజరయ్యారని తెలిపారు. ఆయన తెలంగాణ ప్రజల వెన్నంటి నిలిచారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు తమకు వెన్నంటే ఉన్నారని చెప్పారు. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారని, ఫలవంతమైన చర్చలు జరిగాయని అన్నారు. రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయని, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.