అనారోగ్యం కారణంగా మరణాలు కలచివేస్తున్నాయి. ఆసుపత్రిలో చేరిన వారు పరిస్థితి విషమించడంతో స్వర్గస్తులవుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బండి సంజయ్ అత్త వనజ అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయాన్ని కరీంనగర్ లోని జ్యోతినగర్ లో ఆమె స్వగృహానికి తరలించారు. ఆమె మరణవార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అత్త మరణవార్త తెలుసుకున్న బండి సంజయ్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ వనజ నివాసానికి చేరుకొని.. బండి సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బండి సంజయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి కూడా నివాసానికి చేరుకొని.. ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. బండి సంజయ్ అత్త మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. బండి సంజయ్ అత్తమ్మ మరణవార్త తెలిసి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జ్యోతినగర్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఓం శాంతి.
*బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అత్తమ్మ గారైన కీర్తిశేషులు చిట్ల వనజ గారు పరమపదించిన సందర్భంగా వారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి నాయకులు pic.twitter.com/tWLDX0yzAk
— Mithun Reddy AP (@mithun123mithun) March 27, 2023