భారతదేశంలో క్రికెట్ కు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇప్పటికే క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన పలువురు ఆటగాళ్లు రాజకీయ పదవుల్లో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. ఇక కొంత మంది రాజకీయ నాయకులకు, క్రికెటర్లకు దగ్గరి సంబంధాలు కూడా ఉన్నాయి. సాధారణంగా నాయకుల పుట్టిన రోజు నాడు బర్త్ డే విషెస్ తెలుపడం సర్వ సాధారణమే. ఈ క్రమంలోనే తాజాగా డిసెంబర్ 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్.
డిసెంబర్ 21న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు టీమిండియా టర్బోనేటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్. ట్విట్టర్ వేదికగా జగన్ కు విషెస్ తెలుపుతూ..” గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు బజ్జీ. ప్రస్తుతం హర్భజన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Birthday Greetings to Hon’ble Chief Minister of Andhra Pradesh Shri Y S Jagan Mohan Reddy @ysjagan Ji. Wish you good health, joy and long life.
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 21, 2022