మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెదేపా మహిళా కార్యకర్తలు ముట్టడించారు. అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద మహిళలు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు.
తమను కమిషన్ కార్యాలయంలోకి అనుమతిచకపోతే ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మనే కిందకు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన వినతి పత్రం అందజేసి వెళ్లిపోతామని చెప్పారు. దీంతో 30 మంది మహిళలతో కార్యాలయంలోకి అనుమతించారు. కమిషన్ ఛైర్ పర్సన్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడతో సహా అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ” జగన్ పాలనలో ఊరికో ఉన్నాది” అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు.
పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానన్న కమిషన్ ఛైర్ పర్సన్ పద్మ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనను దూషించారని మాజీ సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ వారిద్దరు విచారణకు హాజరు కావాల్సి ఉంది. నోటీసులు ఇచ్చే అధికారం మహిళ కమిషన్ కు లేదని తెదేపా స్పష్టం చేసింది. మరోవైపు తాను విచారణకు హాజరుకావడం లేదని బొండా ఉమా చెప్పారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.