ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, 52 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలా రెడ్డి కన్నుమూశారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లమిల్లి మూలారెడ్డి అభిమానలుు విషాదంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు మూలారెడ్డి మృతి సంతాపం తెలియజేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి(80) కొంతగాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అనపర్తి మండలం రామవరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1942 మే8న జన్మించిన మూలారెడ్డి..1970లో తొలిసారి రాజకీయ అరంగ్రేటం చేశారు. రామవరం సర్పంచిగా రెండు సార్లు పనిచేశారు. ఈ క్రమంలో 1982లో తెదేపా ఆవిర్భావ సమయంలో యన్టీఆర్ కు దగ్గరయ్యారు 1983 నుంచి 2009 వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మూలారెడ్డి నాలుగు గెలుపొందారు. అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఒకే పార్టీ తెలుగుదేశం నుండి 7 సార్లు పోటీ చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన చరిత్ర మూలారెడ్డిది.
ఆనాటి నుండి నేటి వరకు పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉందంటే కేవలం మూలారెడ్డి పార్టీ శ్రేణులకు అండగా నిలబడి ఏ సమస్య వచ్చిన నేనున్నాను అంటూ పరిష్కారం చేయడమే, నిలబడటమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. చివరగా 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు నల్లమిల్లి రామకృష్టారెడ్డి కూడా అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. మూలారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు. మూలారెడ్డి మృతి చెందడంతో నియోజకవర్గమంతా విషాదం నెలకొంది.