గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీ సీనియర్ నేత. 40 ఏళ్లుగా పసుపు జెండా తప్ప, మరో అజెండా లేకుండా ఆయన రాజకీయాల్లో కొనసాగితున్నారు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబు హయాంలోనూ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో బుచ్చయ్య అధిష్ఠానంపై అలగడం, తరువాత మళ్ళీ అలక వీడటం అందరికీ తెలిసిన విషయమే.
ఒక సీనియర్ పొలిటీషియన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలకి ఒక వైటేజ్ అయితే తప్పక ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బుచ్చయ్య చౌదరిని సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూ చేశారు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ అయిన ఈ “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” ఇంటర్వ్యూ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలకృష్ణ పొలిటికల్ జర్నీపై సంచలన కామెంట్స్ చేయడం విశేషం.
టీడీపీకి జూనియర్ యన్టీఆర్ అవసరం ఎంత వరకు ఉందంటూ జాఫర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలయ్య ప్రస్తావన తీసుకొచ్చారు. “2024 లో టీడీపీ అధికారంలోకి రావాలి అంటే.. చంద్రబాబు కుటుంబంతో పాటు, యన్టీఆర్ కుటుంబం అంతా కలసి రావాలి. ఇప్పటికే పార్టీలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా.., ఆయన రాజకీయాలను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. తన నియోజకవర్గం, తన ఎన్నికలు, తన ప్రచారం.. బాలకృష్ణ ఇక్కడికే పరిమితం అవుతున్నారు. సెకండ్ లైన్ లీడర్స్ గా వీరంతా చంద్రబాబుకి సహాయం చేయాల్సిన ఉందని.. యన్టీఆర్ కుటుంబం ఆ దిశగా ఆలోచించాలని బుచ్చయ్య కామెంట్స్ చేయడం విశేషం. మరి.. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.