ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ నేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే సిద్ధార్థ్ రెడ్డి వాటిని ఖండించారు.
ఈ క్రమంలో తాజాగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కలకలంరేపుతున్నాయి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్ళు పట్టుకొని నారా లోకేష్‌ను కలిశారో అందరికీ తెలుసన్నారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలకు సవాల్ విసిరారు. ఛైర్మన్‌కు ప్లాట్స్, వెంచర్స్ ఓనర్స్ దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్పితే.. అభివృద్ధి శూన్యమని మాండ్ర విమర్శించారు.
ఇది కూడా చదవండి: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన బై రెడ్డి సిద్దార్ద్ రెడ్డి!నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ నాయకుల రాక్షస పాలన నడుస్తోందని.. దానికి ఉదాహరణే డాక్టర్‌పై దాడి అన్నారు శివానందరెడ్డి. ఎమ్మెల్యే ఆర్థర్‌ని గెలిపించింది పార్టీ కానీ వ్యక్తి కాదని.. వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వాపు చూసుకొని బలుపు అనుకుంటున్నారే తప్ప అది బలుపు కాదు వాపే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి.. సొంత పార్టీ పెట్టి ఘోరంగా విఫలం అయ్యారన్నారు. పరోక్షంగా బైరెడ్డిపై మాండ్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ పాటకి బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి డ్యాన్స్! వీడియో వైరల్!
ఇక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి టీడీపీలో చేరతారనే వార్తలను ఆయన ఖండించారు. తాను టీడీపీలో చేరే ప్రసక్తే లేదని.. తాను నారా లోకేష్‌ను కలిసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ది లోకల్ ప్రోటోకాల్.. తనది స్టేట్ ప్రోటోకాల్ అన్నారు. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామని తెలిపారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రి జగన్‌కు విధేయుడినని.. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అంతేకాక సీఎం జగన్ తన మీద నమ్మకంతో.. తనకు కీలక పదవుల్ని అప్పగించారని.. ఆయన తన కోసం ఇంత చేస్తే పార్టీ ఎందుకు మారతానని ప్రశ్నించారు. కొంతమంది తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపేస్తే మంచిదని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. ఈ క్రమంలో మాండ్ర శివానందరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మా అన్నతో నాకు గొడవల్లేవ్.. ఆయన వల్లే నేను ఇక్కడ పార్టీ పెట్టాను: షర్మిల