పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ స్థానంలో వెలువడుతున్న ఫలితాలు అందరిలో హైటెన్షన్ పుట్టిస్తోన్నాయి. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న వైసీపీని వెనక్కి నెట్టి టీడీపీ ముందుకు వచ్చింది.
ఏపీ కొనసాగుతున్న మూడు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అలానే పశ్చిమ రాయలసీమ స్థానంలో నువ్వానేనా అన్నట్లు వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ వార్ నడుస్తోంది. ఈ స్థానంలో ఇప్పటికే వరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. అయితే తాజాగా ఎలిమినేషన్స్ ప్రారంభమయ్యే సరికి పశ్చిమ రాయలసీమ ఫలితాలు తారుమారవుతున్నాయి. తాజాగా వస్తున్న ఫలితాల ప్రకారం.. ఇప్పటి వరకు ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ అభ్యర్థి.. తొలిసారి వెనుకబడ్డారు. టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి 400 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్లా టీడీపీ సత్తా చాటి.. వైసీపీకి షాక్ ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో చిరంజీవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అలానే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యతా ఓట్లు లెక్కించినప్పుడు శ్రీకాంత్ 50 శాతానికి పైగా ఓట్లు సాధించలేదు. దాంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. వాటితో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక మిగిలిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ మధ్య నెట్ టూ నెట్ జరిగింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రా రెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు.
ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగారు. అయితే తాజాగా ఈ ఫలితాలు తారుమారవుతున్నాయి. ఎలిమినేషన్స్ ప్రారంభంమైన తరువాత ఆధిక్యాలు మారాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో టీడీపీకి స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి 400 ఓట్ల స్వల్ప మోజార్టీతో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో టీడీపీ అభ్యర్థి ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం పీడీఎప్ అభ్యర్థి నాగరాజు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
దీంతో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల నేతల్లో టెన్షన్ పట్టుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టుభద్రల ఎమ్మెల్సీ ఫలితం అందరిలో టెన్షన్ పుట్టిస్తోంది. రెండు స్థానాలుకోల్పోయిన కనీసం ఈ స్థానంలో అయినా వైసీపీ గెలవబోతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. అయితే వారి ఆలోచనలను తలక్రిందులు చేసేలా ఫలితాలు వస్తున్నాయి. మరి కొంత సమయంలో ఈ టఫ్ వార్ లో ఎవరు విజేతో తెలియనుంది. మరి.. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.