ఏపీలో రాజకీయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. నిత్యవసర, ఇతర వస్తువుల ధరల పెరుగుదలను టీడీపీ వ్యతిరేకించింది. ఈ క్రమంలో “బాదుడే బాదుడు” అనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురువారం కర్నూలు పర్యటించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లారు. గత ముఖ్యమంత్రులు రూ.3లక్షల అప్పు చేస్తే ..ఒక జగన్ మాత్రం రూ. 8లక్షల కోట్లు అప్పు చేశాడు అంటూ బాబు విమర్శించారు.
‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ…”వైకాపా పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాజ్యసభ సీట్లు ఏ2కు, తన కేసులు వాదించే వారికి సీఎం జగన్ ఇచ్చారు. A2 అప్రూవర్ గా మారిన మరుక్షణం జగన్ జైల్ కి వెళ్తారు. అందుకే ముందు జాగ్రత్తగా రాజ్యసభ సీటు ఇచ్చారు. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వారు.. మూడు రాజధానులు నిర్మిస్తారంటా. కర్నూలుకి హైకోర్టు వస్తుందంటూ మాయమాటలు చెప్పారు. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే..ఈయన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి: రాజ్యసభకు నో ఛాన్స్.. స్పందించిన నటుడు అలీ!
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని నా గుండెల్లో పెట్టుకుంటాను. వచ్చే ఎన్నికల్లో 40 శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు యువతకే కేటాయిస్తాను. ఒక్కోక్క నియోజకవర్గంలో కార్యకర్తలకు ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాను. పార్టీలో 2.0 వెర్షన్ తీసుకోస్తాను. దీని ద్వారా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆదుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను” అని తెలిపారు. మరి..చంద్రబాబు కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.