Tammareddy Bharadwaj: ఏపీ మంత్రులపై దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్లు చేశారు. కొత్త, పాత మంత్రుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి చేయటం కోసం కాకుండా పదవుల కోసం ఏడ్వటం విడ్డూరంగా ఉందని అన్నారు. కొద్ది రోజులక్రితం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కొత్త క్యాబినేట్‌లో అవకాశం దక్కిన వాళ్ల ఆనందం, చోటు దక్కని వాళ్ల బాధలు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. నాకు తెలిసినంత వరకు రాజకీయం అంటే త్యాగం ఉంటుంది. కానీ, ఏపీలో పదవి రాకపోతే ఏడ్చేవాళ్లు ఉన్నారు. పదవుల్లో ఏముంది? పదవి లేకపోతే సేవ చేయలేమా?.. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చేది సేవ చేయటానికి.
మరి వీళ్లు డబ్బు సంపాదించుకోవటానికి వచ్చారా? పదవి రాకపోతే అందుకు అవకాశం ఉండదని బాధపడుతున్నారా?.. లేక, పదవి లేకపోతే గౌరవించరని బాధపడుతున్నారా?.. సీనియర్లు కూడా పదవి రాలేదని బాధపడుతున్నారు. పదవి వచ్చిన వాళ్లు బ్రహ్మాండం బద్ధలు కొట్టినట్లు ఆనందపడుతున్నారు. పదవి రాని వాళ్లు అలగటాలు, రాజీనామాలు చేయటం చూస్తుంటే వారికి ప్రజల ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలు ఎక్కువనిపిస్తోంది’’ అని అన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రమాణ స్వీకారానికి కాకాణి నన్ను పిలవలేదు: అనిల్ కుమార్ యాదవ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.