విడదల రజనీ.. ఆమె పేరు తలచుకోగానే కళ్ల ముందు మెదిలేది.. చూడచక్కని రూపు.. కల్మషం లేని చిరునవ్వు. ఎంత చిన్న స్థాయి వారినైనా పేరుపెట్టి ఆప్యాయంగా పలకరించడం ఆమె నైజం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రజనీ.. ఎక్కడైనా సమస్య ఉందని తన దృష్టికి వస్తే చాలు.. ఆమె క్షణాల్లో వాలిపోతారు. అలా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. రజనీ అంటే చిలకలూరిపేట. చిలకలూరిపేట అంటే రజనీ అన్నంతగా అక్కడ బలమైన ముద్ర వేశారు. వీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అనూహ్యంగా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన రజనీ.. అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. విదేశాల్లో ఉన్న ఆంధ్రులు రాష్ట్రంకోసం కదిలి రావాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆమె తిరిగి వచ్చారు. విశాఖలో నిర్వహించిన మహానాడులో తన రోల్ మోడల్ చంద్రబాబు సమక్షంలో మాటలకు పదును పెట్టారు. ఇప్పటి సీఎం వైస్ జగన్ పై ఆ సభలో వాగ్భాణాలు ఎక్కుపెట్టారు. టీడీపీపై మాటల యుద్ధం మొదలుపెట్టిన ఆమె.. జగన్ దృష్టిలో పడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలుకలూరిపేట ఎమ్మెల్యేగా 8 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టిన ఫైర్ బ్రాండ్. తాజాగా మంత్రి పదవి రేసులో తాను ముందువరుసలో ఉన్నాననే సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారు. చిలకలూరిపేట సమీపంలోని గ్రామంలో 1988 జూన్ 24 న జన్మించిన విడదల రజనీ.. స్కూల్ ఎడ్యుకేషన్ ను అక్కడే పూర్తి చేశారు.
చిన్నప్పటి నుంచి యాక్టివ్ గా ఉండే రజనీ.. ఉన్నత విద్య కోసం భాగ్యనగరం బాట పట్టారు మల్కాజ్ గిరిలో ఉన్న సెంటాన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగి అమాత్య రేసులో అందరికంటే ముందున్నారామె. తొలి ప్రయత్నంలోనే రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఆమె.. భవిష్యత్తులో తనకెవరూ పోటీ లేకుండా పదునైన ప్రణాళికలతో దూసుకెళ్తున్నారు. విడదల రజనీ ఓర్పు, నేర్పు, తెగింపు.. నేటి తరం మహిళల్లో స్థైర్యం నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. ఎమ్మెల్యే విడదల రజనీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.