ప్రస్తుతం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం నాడు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వివరాలు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం యర్రగొండపాలెంలో నిర్వహిస్తోన్న రోడ్ షోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు కాన్వాయ్ మీద రాజకీయ ప్రత్యర్థులు కొందరు రాళ్ల దాడి చేశారు. దీనికి తోడు మరో వైపు శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం, ఈదురుగాలులు వీస్తున్నప్పటకి కూడా చంద్రబాబు నాయుడు తన రోడ్ షో కొనసాగించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో యర్రగొండపాలెంలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఎన్ఎస్‌జీ సిబ్బంది చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ షీట్లను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఎన్ఎస్‌జీ కమాండర్ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. వెంటనే ఆయనకు వైద్యులు కుట్లువేసి కట్టుకట్టారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం యర్రగొండపాలెంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పాలనలో రౌడీలు రోడ్ల మీదకు వచ్చి.. తమపై దాడులు చేస్తున్నారని మండి పడ్డారు. అలానే వైసీపీ నేతలు, సీఎం జగన్ మీద చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. అంతేకాక చంద్రబాబు యర్రగొండపాలెం వచ్చే మార్గంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్లకార్డులు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి నేపథ్యంలో.. ఎన్ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించాయి. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.