కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ, బీజేపీ పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే రాజకీయ భేటీ అనే అనుమానాలు రాక మానదు. అమిత్ షా, ఎన్టీఆర్ ల మధ్య రాజకీయ చర్చలు జరిగాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తారక్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తారక్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో కుటుంబ పార్టీలకి సపోర్ట్ చేయమని అన్నారు. కుటుంబ పార్టీలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమని అన్నారు. అయితే టీడీపీ పార్టీకి చెందిన తారక్ ను తమ పార్టీ ప్రచారం కోసం వాడుకుంటామని సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తారక్ కు ప్రజాదరణ ఎక్కువ కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో బీజేపీకి తెలుసునని అన్నారు. మరి తారక్ టీడీపీని కాదని బీజేపీ తరపున ప్రచారం చేస్తారా? లేదా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.