Mumbai: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి సంబంధించిన సెక్యూరిటీ టీమ్ లో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. నకిలీ ఐడీతో ఒక ఆగంతకుడు సెక్యూరిటీ టీమ్ లో చేరాడు. అమిత్ షా ముంబైలో తన రెండు రోజుల పర్యటనను మంగళవారం ముగించుకున్నారు. అయితే సెక్యూరిటీ టీమ్ లో ఫేక్ ఐడీతో చేరిన ఆగంతకుడి గురించి ఇవాళే తెలిసింది. అనుమానంతో అమిత్ షా సెక్యూరిటీ టీమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో హేమంత్ పవార్ గా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీకి చెందిన పర్సనల్ సెక్రటరీగా పోలీసులు భావిస్తున్నారు.
హోమ్ మంత్రిత్వ భద్రతా శాఖ బృందానికి సంబంధించిన రికార్డ్స్ లో ఆగంతకుడి పేరు ఉందో లేదో పరిశీలించగా అతని పేరు లేదని పోలీసులు గుర్తించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ అధికారిగా సెక్యూరిటీ టీమ్ లో చేరాడని పోలీసులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ భద్రతా సిబ్బంది ఐడీ కార్డు ధరించి గంటల తరబడి అమిత్ షా చుట్టూ తిరిగినట్టు చెబుతున్నారు. పట్టుబడక ముందు అనుమతి లేని ప్రదేశాల్లో అతను ఫ్రీగా తిరిగాడని అంటున్నారు. అమిత్ షా హాజరైన రెండు కార్యక్రమాల్లోనూ హేమంత్ పవార్ ఉన్నాడు. అంతేకాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్ల బయట కూడా కాసేపు చక్కెర్లు కొట్టినట్లు తెలుస్తోంది.
Big Lapse in SECURITY of @AmitShah during Mumbai visit, unknown person roams around Home Minister for HOURShttps://t.co/5pS3AWKnlV
— Narinder Pal Singh (@Narinder156) September 8, 2022
ప్రస్తుతం పవార్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. 5 రోజుల పాటు కస్టడీలో ఉంచనున్నారు. ఇక శివసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన ఏక్ నాథ్ షిండే జూలై 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమిత్ షా ముంబై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఒక ఎంపీకి చెందిన ఆగంతకుడు.. సెక్యూరిటీ టీమ్ లో చేరాడు. అయితే ఆ వ్యక్తి ఎందుకు చేరాడో, ఏ పార్టీ ఎంపీకి చెందిన పర్సనల్ సెక్రటరీ అనే వివరాలు బయటకు రాలేదు. అయితే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.