Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వందల పథకాలు అమలు చేశాం. వైఎస్ జగన్ హయాంలో వందల పథకాలు అమలు చేస్తున్నాము. మరి, చంద్రబాబు హయాంలో ఏవైనా గుర్తుండిపోయే పనులు చేశారా?.
చంద్రబాబు మన కళ్లముందన్న ఆషాడభూతి. ఎల్లో మీడియా కథనాలతో బాబు రాజకీయాలు చేస్తున్నారు. ఈనాడు పత్రిక పరిస్థితి దారుణంగా తయారైంది. నెల్లూరు జంట హత్యలను వైఎస్సార్‌సీపీపై తోసే ప్రయత్నం చేసింది. ఎంతోమంది జీవితాలను ఆ ఎల్లో మీడియా, చంద్రబాబు పార్టీ నాశనం చేసింది. దోచుకోవటం, పంచుకోవటం చంద్రబాబు ఆశయం’’ అని అన్నారు. మరి, చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రేషన్ షాపులో మోదీ ఫోటో కాదు.. ముందు కేంద్రంలో KCR ఫోటో పెట్టాలి: హరీశ్ రావు