సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సోమవారం అయన ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్ కోరడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
26 ఏళ్ల కాలం పాటు పోలీస్ విభాగంలో పని చేశానని, తనకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని అయన తెలిపారు. ఇక నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ మేరకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రెండు పేజిల లేఖ రాస్తూ ప్రభుత్వానికి పంపారు. ఈ లేఖలను ఆయన ట్విట్టర్ కూడా పోస్ట్ చేశారు. ఇక ఉన్నట్టుంది హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తు ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఇక తాజాగా ఈయనపై కొంతమంది వివాదాలు కూడా సృషించారు .