మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు నిజంగా దమ్ముంటే అమరావతికి ‘ కమ్మరావతి’ పేరు పెట్టరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో తెలంగాణ కమ్మ సేవా సమితి ఆద్శర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు చదువుకున్నవాడివైనా అమరావతికి, కమ్మవారికి ఉన్న గత చరిత్ర ఏమిటో నీకు అర్థం కాదని అన్నారు.
ఇది కూడా చదవండి: APలో మరో కొత్త రాజకీయ పార్టీ.. వారిని ఓడించేందుకేనట!
జగన్ మోహన్ రెడ్డి పొరపాటున ముఖ్యమంత్రి అయ్యారని, అమరావతిని కమ్మరావతి అంటూహేళన చేస్తున్నారని రేణుకా చౌదరి విమర్శించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారంటూ విమర్శించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రేణుకా చౌదరి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.