రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తన కన్ను తానే పొడుచుకున్నారా? ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై అనర్హత వేటు తప్పదా?
ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని.. తన ఓటు అమ్ముకుంటే పార్టీలో మంచి పొజిషన్ ఉంటుందని అన్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామమైన చింతలమోరిలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత గ్రామానికి చెందిన వారే కాక పక్క ఊర్ల నుంచి కూడా కొందరు వచ్చి తనకు దొంగ ఓట్లు వేశారని అన్నారు.
ఒక్కొక్కరూ పది దొంగ ఓట్లు వేయడం వల్లే తాను గెలిచేవాడినని.. అప్పటి నుంచి తన గెలుపుకు దొంగ ఓట్లే కారణమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇదే ఇప్పుడు రాపాకను ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. 2019లో జనసేన తరపున గెలిచి ఆ తర్వార వైసీపీకి మద్దతు ఇస్తూ వచ్చిన రాపాక.. తన గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు అని అనడంతో ఆయన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం గనుక ఎలక్షన్ కమిషన్ చెవిన పడితే.. ఆయనపై అనర్హత వేటు తప్పదని అంటున్నారు. దీంతో జనసేన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
రాపాకపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు తప్పదని.. తన కన్ను తనే పొడుచుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దొంగ ఓట్లు పడ్డాయని అంత బహిరంగంగా చెప్పడంలో రాపాక ఉద్దేశం ఏమిటి? ఆయన చీటింగ్ చేసి గెలిచారా? లేక చీట్ చేసి గెలిపించారా? ఏది ఏమైనా గానీ రాపాక వ్యాఖ్యల వల్ల సరికొత్త సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉందని జనసేన శ్రేణులు చెబుతున్న మాట. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన రాపాక.. జనసేన పార్టీతో సత్సంబంధాలు కోల్పోయి వైసీపీతో ఉన్నారు. అయితే పార్టీలో ఆయన స్థానం ఏంటన్నది పక్కన పెడితే.. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. దీంతో జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రాపాక చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.