ఏపీ మంత్రివర్గ విస్తరణలో పలువురు కొత్త వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. నూతన కేబినెట్‌లో ఆయన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు స్వీకరించారు అంటూ అమర్నాథ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను ఉద్దేశిస్తూ RGV చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో KGF-2 కలెక్షన్స్ సునామీ! బీ-టౌన్ గాలి తీసిన RGV ట్వీట్!
మంత్రి పదవి స్వీకరించిన గుడివాడ అమర్నాథ్‌కు శుభకాంక్షలు తెలిపిన వర్మ.. ‘‘32 ఏళ్ల వయసులోనే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే మీరు ఇంత పెద్ద గొప్ప విజయాన్ని సాధిస్తే.. ఇక 82 ఏళ్లు వచ్చే సరికి ఏం సాధించగల్గుతారో ఊహించలేకపోతున్నాను. శుభాకాంక్షలు’’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
ఇది కూడా చదవండి: రాముడితో కంటే రావణుడితో పోలిస్తేనే నాకు మరింత సంతృప్తి-ఆర్జీవీ
వర్మ ట్వీట్‌పై మంత్రి స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. అందుకే తమ నేత (జగన్) యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. వయసు 32 అయితే ఏముంది.. 37 అయితే ఏంటన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా భవిష్యత్‌లో అందరి సహకారంతో కష్టపడి పనిచేసి ముందుకు సాగుతానని తెలిపారు.
Thank you @RGVzoomin Sir. Perhaps my leader feels young legs and tireless pursuit are needed to secure global investments. My gratitude to Sri @ysjagan for his extraordinary vision and courage in taking this step. #TimetoGiveBack #TimetoBuild https://t.co/jItMz08dF5
— Gudivada Amarnath (@gudivadaamar) April 14, 2022
అమర్నాథ్ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు కుమారుడు. అమర్నాథ్ తండ్రి నుంచి రాజకీయ వారసత్వం కొనసాగించారు. అమర్ 21 ఏళ్ల వయసులోనే 2007లో టీడీపీ నుంచి విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌గా పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత2014 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసి అప్పటి టీడీపీ ఎంపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నం నగర, రూరల్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. గుడివాడ అమర్నాథ్ సోమవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయన ఐటీ, పరిశ్రమలశాఖ బాధ్యతలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: RRRపై కేఏ పాల్ సెటైర్స్. .నీ మొహం రా అంటూ వర్మ కౌంటర్!