ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలను సీఎం జగన్ చేపట్టారు. ముఖ్యంగా నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. తాజాగా మరో పథకానికి శ్రీకారం చూట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలను సీఎం జగన్ చేపట్టారు. ముఖ్యంగా నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. కేవలం పాఠశాల నిర్మాణంలోనే కాకుండా.. విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం విషయంలోనూ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
చిన్నారుల పోషకాహార లోప నివారణకు ‘జగనన్న గోరు ముద్ద’ పథకంలో భాగంగా ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట రాగిజావ అందించనున్నారు. రాగి జావ పంపిణీకి ఏడాదికి రూ.84 కోట్ల ఖర్చు, మొత్తం రూ.1,910 కోట్లతో 38 లక్షల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించనున్నారు. విద్యార్థులకు రాగి జావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులతో సీఎం మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 38 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాగి జావ అందించడం ద్వారా విద్యార్థుల్లో ఐరన్, క్యాల్షియం లోపం రాకుండా ముందుగానే నివారించవచ్చని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు మంచి చేసేలా దేవుడి దయతో నేడు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం అన్నారు. చిన్నారులకు రుచికరంగా ఆహారం వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఇంకా జగన్ మాట్లాడుతూ..” మనం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి బడి మానేసే పిల్లల సంఖ్యను తగ్గించడం ఎలా? స్కూళ్లలో సదుపాయాలను కల్పించడం ఎలా? విద్యార్థుల్లో మేథో వికాసాన్ని పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గర్భవతుల నుంచి పాఠశాల విద్యా పూర్తయ్యే వరకు చిన్నారులకు పౌష్ఠికాహారం అందించే కార్యక్రమాన్ని వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మన ప్రభుత్వం గోరు ముద్ద ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రతిష్ట్మాతకంగా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
దీని కోసం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రోజుకో మెనూతో పిల్లలకు భోజనం పెడుతున్నామని, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారో నిత్యం పరిశీలిన చేస్తున్నారని.. గతంలో ఇలాంటి పరిస్థితులు మచ్చుకు కూడా ఉండేవి కాదన్నారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.