సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ముందు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో.. సీఎం జగన్ సరికొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చాడు. మహిళా సాధికరత కోసం బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలతో పాటు.. ఉన్నత సామాజిక వర్గంలో పేద మహిళలకు కూడా ఆర్థిక సాయం చేసే పథకాలను తీసుకొచ్చారు. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ పథకాలు ప్రారభించారు. జగన్ ఆలోచనలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు.
తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నారు కోన వెంకట్. ఈ సందర్భంగా ఆయన సినిమాలతో పాటు.. రాజకీయాలపై కూడా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ తీసుకొచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల హృదయాలకు టచ్ అవుతున్నాయని తెలిపారు. 90 శాతం మంది అర్హులకు ఈ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. పలు సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు కోటి 60 లక్షల రూపాయల డబ్బు ప్రజలకు అందిందని వెల్లడించారు. ప్రజలు దాన్ని ఖర్చు చేయడం ద్వారా.. మార్కెట్‌లో మనీ సర్క్యూలేషన్ జరిగిందని.. గతంలో పేదవాళ్లుగా ఉన్నవారు.. ఇప్పుడు దరిద్ర రేఖకు ఎగువన ఉన్నారిగా మారారని చెప్పుకొచ్చాడు. వలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉంది అని ప్రశంసించారు. నూటికి నూరు శాతం జగన్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
తన కుటుంబం ముందునుండి కాంగ్రెస్ పార్టీలో ఉండేదని కోన వెంకట్ గుర్తు చేశారు. ఇక రాజశేఖర్‌రెడ్డి.. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే.. జగన్ విద్య కోసం ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత వరకు ఏ సీఎం చేయని పనులను జగన్ చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది అని కోన వెంకట్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.