దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించింది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మీద ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓ గిరిజన మహిళ ఇంతటి అత్తున్నత స్థానానికి ఎన్నిక కావడంతో దేశవ్యాప్తంగా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ద్రౌపది ముర్ము పేరు ట్రాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఆరుకుపైగా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటం.. మహిళకు పట్టం కట్టాం అనే సెంటిమెంట్ 2024 ఎన్నికల్లో కలిసొస్తుందనే బీజేపీ ఆమెను ఎంచుకుందనే రాజకీయ వాదనలు పక్కనపెడితే, నిజంగానే ద్రౌపది ముర్ము జీవితం.. ఎందరికో ఆదర్శం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. రాజకీయాల్లో నేడు ఈ ఉన్నత స్థానానికి చేరుకుంది. అయితే రాజకీయంగా ఎంతో విజయవంతంగా సాగుతున్న ఆమె వ్యక్తిగత జీవిదంలో అంతులేని విషాదాలు ఉన్నాయి. ఆ వివరాలు..
అధికార ఎన్డీఏ కూటమి తరఫున బరిలో నిలిచి రాష్ట్రపతిగా విజయం సాధించడంతో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రౌపది ముర్ము గురించి తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించింది. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె తన 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి స్థానాన్ని అధిరోహించే వరకు చేరుకున్నారు.
బాల్యం, విద్యాభ్యాసం…
ఒడిశా రాష్ట్రంలో 1958 జూన్ 20న అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్(పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుది) జిల్లా బైడపోసి గ్రామంలో ఓ గిరిజన కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్ తెగ. పేదరికం వల్ల బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ కష్టాలను దాటుకుని.. విద్యాభ్యాసం సాగించిన ద్రౌపది.. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆర్ట్స్ విద్యార్థి అయిన ముర్ము.. తొలుత సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా టీచర్ గా పనిచేశారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ..
చదువుకున్న వ్యక్తిగా తన గిరిజనం బాగు కోసం నిత్యం తపించే వారు ద్రౌపది ముర్ము. ఈ క్రమంలో ఆమె తొలిసారి బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2007లో ఒడిశాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ద్రౌపది ముర్మకు ప్రదానం చేశారు.
ఇది కూడా చదవండి: KA Paul: రాష్ట్రపతి అభ్యర్థిపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా ఫ్రెండే అంటూ!
పార్టీపరంగా బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా కొంత కాలం పని చేశారు ద్రౌపది ముర్ము. 2010, 2013లో రెండుసార్లు మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. అంతేకాక జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా విజయం సాధించి.. మరో సరికొత్త రికార్డు సృష్టించారు ద్రౌపది ముర్ము.
వ్యక్తిగత జీవితంలో విషాదాలెన్నో..
ద్రౌపది ముర్ము రాజకీయ జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నప్పటికి.. వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంత విషాదభరితంగా సాగింది. ముర్ము భర్త శ్యాంచరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, ద్రౌపది భర్త శ్యాంచరణ్‌తో పాటు ఇద్దరు కుమారులు కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపదికి.. మిగిలిన ఏకైక తోడు కుమార్తె ఇతిశ్రీనే. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము.
గెలిచే అవకాశాలే అధికం..
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికవ్వడంతో పలు ఘనతలు ఆమె ఖాతాలో చేరాయి. తొలి గిరిజన, అందునా మహిళా రాష్ట్రపతిగా సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Video: వారెవ్వా.. చుట్టూ లైట్లు.. స్కూటర్ మాములుగా లేదుగా..! వీడియో వైరల్
ఇది కూడా చదవండి: Hanmakonda: నా భార్యకు న్యాయం చేయండంటూ సెల్ టవర్ ఎక్కిన భర్త! కారణం ఏంటో తెలుసా?