శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఇక ఇదే కాకుండా ఈ ఘటనపై నటుడు బాలక్రిష్ణ సైతం ఘాటుగా స్పందించి వార్నింగ్ ఇచ్చేంత పని చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలోని అసెంబ్లీ ఘటనపై స్పందించిన ప్రకాషం జిల్లాలోని ఓ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా పేరు పేరు విజయ్ కృష్ణ 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ రిటర్న్ టెస్ట్ టాపర్ ని అని 2002, 2003లో ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా రెండుసార్లు నిలిచానన్నారు.
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/avzAJHnin3
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 20, 2021
చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయితీగా బ్రతికానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కాకుండా వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావంటూ కన్నీటిపర్యంతమయ్యారు. నా జీవితంలో అవినీతికి తావు లేకుండా ఉద్యోగం చేశానన్నానని ఎప్పుడూ ఒకరికి పెట్టడమే కానీ చేయి చాచింది లేదన్నారు. పోలీస్ వ్యవస్థలో మోకరిల్లి, పోస్టింగుల కోసం నీచమైన అవమానాలు ఎదుర్కొని సాగిలపడి, సాష్టాంగపడి దిగజారిపోతున్నారన్నారని కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు తనకు ఈ క్యాప్, బెల్ట్ వద్దని ఇన్నాళ్లు తనకు తిండి పెట్టిన పోలీస్ ఉద్యోగాన్ని గౌరవిస్తూ ఎవర్నీ ఏ విమర్శలు చేయకుండా ప్రజల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ కానిస్టేబుల్ ప్రకటించారు. తర్వాత టీ కొట్టు, టిఫిన్ సెంటర్ పెట్టుకుని బతుకుతానని కానిస్టేబుల్ తెలిపారు.
చంద్రబాబు గారి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఒక కానిస్టేబుల్ ఖండించారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని.. ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయతీగా బ్రతికానని…వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు pic.twitter.com/14ojnO75OJ
— Ravi Kondapalli (@Ravi_4545) November 20, 2021