ఏపీ సీఎం జగన్ ఒక సైకో అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ ఓ సైకో అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సినీ నటుడు, ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ ను బాలకృష్ణ సైకో అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ సైకోనా? లేక బాలకృష్ణ సైకోనా? అనే విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. బాలకృష్ణ తుపాకీతో ఇద్దరిని కాల్చారని.. ఇలా మంచోళ్ళు కాలుస్తారా? లేక సైకోలు కాలుస్తారా? అని విమర్శించారు. మనకు చట్టం, న్యాయం ఉన్నాయని.. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి గానీ తుపాకీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు కాల్చేస్తారా? పోనీ కాల్చిన తర్వాత ఒక్క రోజైనా జైలులో ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు.
అదే పోసాని కృష్ణమురళి ఇద్దరిని కాలిస్తే అమాయకుడు అని చెప్పి వదిలేస్తారా? కొట్టి జైల్లో పెడతారు. కానీ బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడని, ఎవరూ ఏమి చేయలేకపోయారని, ఒక్కరోజు కూడా జైలుకెళ్లలేదని విమర్శించారు. ఎవరు అసమర్ధుడు, ఎవరు క్రూరుడు, ఎవరికి మానసిక అనారోగ్యం అని అన్నారు. బాలకృష్ణ ఇంట్లోనే ఆయన కళ్ళ ముందే నైట్ వాచ్ మేన్ చనిపోతే.. తెల్లారి మేకప్ వేసుకుని మృతదేహాన్ని దాటుకుని షూటింగ్ కి వెళ్లిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడిగారా? జగన్ సైకోనా? లేక ఆయన సైకోనా? అనేది ప్రశ్నించుకోవాలని అన్నారు. ఒక ఫంక్షన్ లో స్టేజ్ మీద బాలకృష్ణ.. ‘ఆడాళ్ళు కనబడితే కడుపు చేయాలి’ అంటూ నీచంగా మాట్లాడారు. ఇలాంటి నీచమైన పదాలు జగన్ మాట్లాడడం విన్నారా? అంటూ ప్రశ్నించారు.
ఇలాంటివి చాలా ఉన్నాయని.. పబ్లిక్ లో జనాలను కొట్టడం సహా ఎన్నో లెక్కలేనన్ని ఘటనలు ఉన్నాయని అన్నారు. జగన్ ఎప్పుడైనా ఇలా ప్రవర్తించడం చూశారా అంటూ మండిపడ్డారు. జగన్ ఎవరినైనా కొట్టడం గానీ, ఎవరినైనా అరేయ్ అన్న మాట అనడం గానీ విన్నారా అంటూ ప్రశ్నించారు. బాలకృష్ణ గురించి ఏం మాట్లాడతామని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన పోసానికి ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ఫైబర్ నెట్ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మరి బాలకృష్ణపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.