సాధారణంగా ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.. లేదా ఆరోపణలు చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. సొంత భ్యార్యే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అత్యాచారం, గృహహింస చట్టం కింద ఆమె ఈ కేసు పెట్టింది. వీటితో పాటుగ అసహజ సెక్స్, చంపుతా అంటూ బెదింపులు చేశాడని సదరు MLAపై భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులపై సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ.. నా భార్యే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోందని.. పైగా రూ. 10 కోట్ల రూపాయలు ఇవ్వమని బెదిరిస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తనతో అసహజ శృంగారం చేయాలని, అంతేకాకుండా పెళ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్ పై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదీ కాక మా ఇంట్లో పనిమనిషి భర్తపేరున ఎన్నో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆమె ఆరోపించింది. ఈ క్రమంలోనే తన భర్త సహజీవనం చేస్తున్న సోనియా భరద్వాజ్ ఆత్మహత్యలో సైతం ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. ఇక మానసికంగాక, శారీరకంగా నన్ను ఎంతగానో ఇబ్బందులకు గురిచేశాడని ఫిర్యాదులో తెలిపింది. ధార్ జిల్లాలో ఈ కేసులు నమోదు కావడంతో.. ఈ కేసులపై స్పందించాడు ఉమంగ్ సింగార్.
MP | FIR registered against Congress MLA Umang Singhar at Naugaon PS in Dhar for allegedly raping & mentally harassing a woman. Case registered u/s 376 (rape), 377 (Unnatural offences) & 498 (enticing/taking away/detaining with criminal intent a married woman) of IPC.
(File pic) pic.twitter.com/JvgdPC3jd0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 21, 2022
ఇవన్నీ తప్పుడు కేసులు, నా భార్యే నన్ను మానసికంగా వేధిస్తోందని ఉమంగ్ పేర్కొన్నాడు. ఇక నన్నుతప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తోందని, రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఎమ్మెల్యే తెలిపాడు. ఈ నేపథ్యంలోనే గృహహింస చట్టం 498- A కింద, 376(2) సెక్షన్ కింద అతడిపై రేప్ కేసు ఫైల్ చేసినట్టు ధార్ ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉమంగ్ సింగార్ గంద్వాని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగే కమల్ నాథ్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కీలక పదవిని సైతం అతడు నిర్వర్తిస్తున్నాడు.
Dhar, Madhya Pradesh | A case has been registered against Gandhwani MLA Umang Singar regarding domestic violence under 498-A (domestic violence), 376 (2) (rape) and other sections. Police conducting a probe. Case filed on the basis of a complaint lodged by victim woman: SP, Dhar pic.twitter.com/XqqnciU9vs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 21, 2022