రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువుల ఉండరని ప్రతీతి. పార్టీల సిద్ధాంతాల మేరకు విమర్శలు, ఆరోపణలు చేస్తారు. వ్యక్తిగతంగా మాత్రం నేతల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. దానిలో భాగంగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం.. కుటుంబ ఫంక్షన్ లకు హాజరు కావడం వంటివి చోటు చేసుకుంటాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నేడు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణలు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ సహా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.
‘‘గొప్ప వాక్పిటమ, ముందుచూపు కలిగిన పోరాట యోధుడు కేసీఆర్. రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తినా.. కేసీఆర్ తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఓ ప్రత్యేక పంథాను ఏర్పర్చుకుని.. రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయ శైలీని ప్రత్యర్థులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది వాస్తవం. ఇక రాష్ట్ర విభజన తర్వాత.. హైదరాబాద్ తో పాటు, తెలంగాణ అంతటా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయడం నాకు ఆనందాన్ని కలిగించింది. నూతన వసంతంలోకి అడుగుపెడుతున్న కేసీఆర్ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని భగంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
శ్రీ కె.సి.ఆర్. గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan #HappyBirthdayKCR pic.twitter.com/gsuCZFkBnf
— JanaSena Party (@JanaSenaParty) February 17, 2022