జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఎంతో సేవ చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రేండేళ్ల ముఖ్యమంత్రి సంజీవయ్య సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని పవన్ గుర్తుచేశారు. ఎలాగైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప పెట్టుకున్నారో అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.