మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పలు కీలకమైన అంశాలపై స్పందించారు. ఈ క్రమంలో వంగవీటి రంగా హత్యపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొప్పనాయకుడు వంగవీటి రంగా ఒక సమావేశం ఏర్పాటు సముద్రంలా జనం వచ్చారని, అదే సమయంలో ఆయనను అత్యంత దారుణంగా హత్య చేస్తే వాళ్లంతా ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ సభలో ఆయన రంగా పేరును ప్రస్తావించగానే ఆ పార్టీ కార్యకర్తల పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో సభ దద్దరిల్లింది. అనంతరం పవన్‌కళ్యాణ్ పలు అంశాలపై స్పందించారు.