ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. పార్టీలకి అతీతంగా నాయకులు ఈ విషయంలో రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది చంద్రబాబు కన్నీరు ఘటనపై సెటైర్స్ పేలుస్తుంటే, మరికొంతమంది మాత్రం ఈ విషయంలో ఆయనకి అండగా నిలిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ సైతం ఈ విషయంలో స్పందించారు.
‘‘రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయి. చంద్రబాబు తన భార్యను కించపరిచారని కంటతడి పెట్టారు. ఆయన కంటతడి పెట్టడం బాధ కలిగించింది. కుటుంబసభ్యులను కించపరచడం తగదు. రాష్ట్రంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పట్టించుకోకుండా ఒకరినొకరు విమర్శించుకోవడం దురదృష్టకరం’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే.., పవన్ స్పందనపై వైకాపా నేతలు మరోలా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబుకి కష్టం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అవుతాడని, ఇప్పుడు కూడా పవన్ అలానే స్పందించాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక.. పవన్ ఈ వివాదంపై మాత్రమే కాక, రాష్ట్రంలోని వరదలపై కూడా స్పందించాడు. ప్రకృతి విపత్తుతో రాయలసీమ అతలాకుతలమైందని, ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. మరి.. ఈ ఘటనలో జనసేనాని చంద్రబాబుకి అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.