2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక పక్క సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పక్షం మీద నిత్యం విమర్శలు గుప్పిస్తున్న జనసేనాని.. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. జనసేన అధికారంలోకి రావడం కంటే, వైసీపీ అధికారం పోగొట్టడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందన్న విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. రాబోయే ఎన్నికల కోసం ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. మిలటరీ ట్రక్ ని పోలిన వాహనాన్ని రెడీ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోను, ఫోటోలను సోషల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆ ఎన్నికల రథానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. ‘ఎలక్షన్ బ్యాటిల్ కి వారాహి సిద్ధంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. జనసైనికులు అంతా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన రథం వద్ద నిలుచుని ఫోటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా యుద్ధానికి సై అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022