ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా మారాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే.. రాజకీయాలు మాత్రం ఓ రేంజ్‌లో హీటెక్కాయి. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళంలో నిర్వహించిన యువశక్తి సభ.. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. సభలో పవన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాజకీయావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లు.. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగగా.. యువశక్తి సభలో పవన్ దాని మీద ఓ క్లారిటీ ఇచ్చారు. అలానే తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రానున్న ఎన్నికల్లో.. జనసేన వ్యూహం ఏంటో పార్టీ శ్రేణులకు వివరించారు పవన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తూ.. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే.. గత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో వైసీపీ సాంకేతికంగా గెలిచింది. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నేను అలాంటి ప్యాకేజీలకు ఆశపడే వ్యక్తిని కాదు. ఏటా రూ. 25 కోట్లు ట్యాక్స్ కట్టే వ్యక్తిని నేను. చంద్రబాబు, పవన్ రెండున్నర గంటలు ఏం మాట్లాడుకున్నారో అంటూ తెగ గింజుకుంటున్నారు. కానీ మేం సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి.. తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి నెట్టేశాడేంటని ఓ 18 నిమిషాలు.. రాష్ట్రంలో లాం అండ్ ఆర్డర్ ఎందుకు ఇలా చితికిపోయింది.. దాని పరిరక్షణకు ఏం చేయాలి అనే దాని గురించి మరో 38 నిమిషాలు మాట్లాడుకున్నాం’’ అని తెలిపారు.
‘‘మా మాధ్య మాటలు సాగుతన్న కొద్ది సమస్యలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని గంటన్నర సేపు చర్చించుకున్నాం. అలానే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేదానికి నేను కట్టుబడి ఉన్నాను. సీట్ల గురించి చంద్రబాబుతో నేను మాట్లాడలేదు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదు. జన సైనికులు నాకు ఆ భరోసా ఇస్తారా.. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అందుకే పొత్తులకు వెళ్తున్నాం. కానీ, ఇక్కడ ఓ షరతు ఉంది. గౌరవం తగ్గకుండా.. కుదిరితే పొత్తుకు వెళ్తాం.. లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. రాజకీయాల్లో దశాబ్దం పాటు ఒంటరిగానే పోరాడా. వచ్చే ఎన్నికల్లో వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం. ఇది పక్కా’’ అన్నారు పవన్ కళ్యాణ్
‘‘అయినా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయం అంతా 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతోంది. రాష్ట్రంలో వేరే కులాలు లేవా.. అందరూ సమానమే. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. నేను ఏడాదికి రూ. 250 కోట్లు సంపాదించగలను. నా ఒక్క రోజు సంపాదన కోటి రూపాయలు. కోట్ల మంది ప్రజల కోసం కోట్లు వదులుకోవడానికి సిద్ధం. మీ కోసం నేను రోడ్ల మీదకు వస్తాను’’ అన్నారు పవన్ కళ్యాణ్. మరి రానున్న ఎన్నికల్లో మిశ్రమ ప్రభుత్వం తథ్యమన్న పవన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.