ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఎక్కడ కూడా హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ ఖేల్ ఖతం అంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఫలితాలు కాంగ్రెస్ కు చుక్కలు కనిపించాయి అని సెటైర్లు వేశారు. కానీ ఇంత జరిగినా ఓ విషయంలో మాత్రం యూపీలో రికార్డ్ సృష్టించింది హస్తం పార్టీ. మరి ఆ రికార్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీలో రాంపుర్‌ఖాస్ నియోజకవర్గం నుంచి ప్రమోద్ తివారీ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థులు 1980 నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. గత 42 ఏళ్లలో యూపీలో పలు పార్టీలు వాటి సత్తా చాటినా.. ప్రభుత్వాలు మారినా రాంపుర్‌ఖాస్‌లో కాంగ్రెస్ జెండా ఇప్పటికీ ఎగురుతోంది. ప్రమోద్ తివారీ కుటుంబం అంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లే. 1980 ఎన్నికల్లో తొలిసారి రాంపూర్‌ఖాస్ నుంచి ప్రమోద్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1985, 89, 91, 93, 96, 2002, 7, 12 ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలిచారు.
మొత్తం 9 సార్లు ఆయన గెలుపొందారు. మళ్లీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నగేశ్ ప్రతాప్ సింగ్‌పై 14 వేల ఓట్ల మెజార్టీ గెలిచి రికార్డ్ సృష్టించారు. ఈ ఎన్నికల్లో రాంపుర్‌ఖాస్‌ను తమ సొంతం చేసుకుందామని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసినా వారి పప్పులు ఉడకలేదు. యూపీ అంతటా సత్తా చాటినా.. చివరికి ఆ నియోజకవర్గంలో కమలం వాడింది. గత 40 ఏళ్లుగా ఒకే కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. ఘోర పరాజయంలోనూ ఇప్పుడు హస్తం పార్టీ రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.